
సినీ నిర్మాతల కార్యాలయాల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలం లో 8చోట్ల తనిఖీలను చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
పలు పత్రాలను ఐటీ అధికా రులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది,
వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సినిమాల్లో భారీగా పన్ను ఎగవేతలు ఉన్నాయని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఒక్కో సినిమాను వందల కోట్లతో నిర్మించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఏకకాలంలో రైడ్స్ చేపట్టింది.
పుష్ప 2 ఫిలిం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది, సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో భారీగా బడ్జెట్ చిత్రాలపై ప్రధానంగా ఐటీ శాఖ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
సినీ నిర్మాతలు, వారి సమీప బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..
