SAKSHITHA NEWS

తరంగాల దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు .

వరంగల్ జిల్లా…
.

వర్ధన్నపేట టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తరంగాలు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…

పత్రికలు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ ప్రభుత్వానికి చేరవేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అప్పుడే ప్రజల మన్ననలు పొందుతాయని అన్నారు.తరంగాలు దినపత్రిక ద్వారా ఎడిటర్ నాగరాజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను,ప్రజా సమస్యలను తెలియపరిచే విధంగా కృషి చేస్తున్నారని అనతి కాలంలోనే ప్రజల మనసులను చురగొన్న తరంగాలు దినపత్రిక భవిష్యత్ లో మంచి స్థానంలో నిలుస్తుందని అకాంక్షించారు….

ఈ కార్యక్రమంలో క్రాంతి జ్యోతి దినపత్రిక ఎడిటర్ ఐత ప్రవీణ్ కుమార్, వాస్తవం దినపత్రిక వర్ధన్నపేట ఆర్సి ఇంచార్జి సట్ల అనిల్, మాజీ జెడ్పిటిసి కమ్మగోని ప్రభాకర్ గౌడ్,వర్దన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పత్రి భానుప్రసాద్,వర్దన్నపేట పట్టణ అధ్యక్షులు మైస సురేష్ కుమార్,కౌన్సిలర్లు సమ్మెట సుదీర్ గౌడ్,తుమ్మల రవీందర్,భూక్యా శ్రీలత,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్ర మాలతి శ్రీనివాస్ రెడ్డి,మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు మహ్మద్ చోటు,జిల్లా నాయకులు పోశాల వెంకన్న గౌడ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కుల్ల యాకాంతం,నాయకులు నాంపల్లి రవీందర్, శ్రీపాద సతీష్,తీగల సునీత,పాక సుజాత,లింగం రజిత రెడ్డి,మడత ప్రశాంత్ గౌడ్,గుంటి కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.