ఘట్కేసర్ మున్సిపాలిటీ జాతీయ రహదారి పై బస్ స్టాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన TGSTRC లాజిస్టిక్స్ ని ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , చెంగిచెర్ల డిపో మేనేజర్ కె. కవిత ,
ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పట్టణ మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు TGSRTC గుడ్ న్యూస్ అందించింది. తమ సేవలను మరింతగా విస్తరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది ఆర్టీసీ. అందులో భాగంగానే పార్శిల్ సర్వీసులను రేపటి నుంచి పార్శిళ్ల చేయనున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాల కు వేగవంతమైన సేవలను అందించేందుకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అవసరం ఉన్న ప్రజలందరూ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు…
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్ , నాయకులు పల్లె విజయ్ గౌడ్ , కార్గో నిర్వాహకులు ఆంజనేయులు , కిషోర్ , తదితరులు పాల్గొన్నారు….