గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

Spread the love

నాలుగు వారాల వరకు మాత్రమే స్టే

గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ రూపంలో అభ్యంతరాలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని, నాలుగు వారాల తర్వాత విచారణ జరగనున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది.


కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, దానికి కొనసాగింపుగా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించడం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి లేఖ రాసి వీలైనంత తొందరగా గెజిట్ జారీ చేయాలని ఆదేశించడం.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల వరకు ఆయనకు రిలీఫ్ లభించినట్లయింది.
సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి తరఫు న్యాయవాది సుందరం వాదిస్తూ.. మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ గతంలో కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కొన్ని అంశాలను హైకోర్టు

Related Posts

You cannot copy content of this page