SAKSHITHA NEWS

అనారోగ్యంతో బాధపడుతున్న V3 న్యూస్ విలేఖరి అబ్దుల్ బాసిత్ కు అండగా గాదె మధుసూదన రెడ్డి

ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్దనే వైద్యం చేయించుకుంటున్న బాపట్ల జమేదార్ పేట కు చెందిన V3 విలేఖరి అబ్దుల్ బాసిత్ కు వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- లను పంపించిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతా కిషోర్,D. ప్రసన్న కుమార్, మహిళా నాయకురాలు G.గిరిజా రాణి, M.తిరుపతి రావు, బాపట్ల 6వ వార్డు యాదవ సంఘం పెద్దలు తదితరులు తమ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు ‌ గాదె మధుసూదన రెడ్డి బాసిత్ ను ఫోన్లో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఏ అవసరం వున్నా నేనున్నానంటూ బాసిత్ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ బాసిత్ కుటుంబసభ్యులు ఆర్ధిక సహాయం అందించిన గాదె మధుసూదన రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


SAKSHITHA NEWS