హైదరాబాద్:
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సొలిపేట పనిచేశారు. సొలిపేటకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనిలో నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూశారు. ప్రజలు, నేతల సందర్శనార్ధం సొలిపేట రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని నివాసం వద్దే ఉంచనున్నారు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సొలిపేట మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
Related Posts
డి బి సి డబ్ల్యూ ఓ (DBCWO) జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్
SAKSHITHA NEWS సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా డి బి సి డబ్ల్యూ ఓ అధికారిగా వ్యవహరిస్తున్న బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసి విచారణ జరిపించాలని పి డి ఎస్ యు ఉమ్మడి మహబూబ్‌నగర్…
మైనారిటీ నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల పరీక్షలపై ఉచిత శిక్షణా తరగతుల కోసం దరఖాస్తు
SAKSHITHA NEWS మైనారిటీ నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల పరీక్షలపై ఉచిత శిక్షణా తరగతుల కోసం దరఖాస్తుల గడువును 15 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎం.పి. రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ…