
- డి బి సి డబ్ల్యూ ఓ (DBCWO) జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసి విచారణ జరపాలని (PDSU) పి డి ఎస్ యు డిమాండ్
సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా డి బి సి డబ్ల్యూ ఓ అధికారిగా వ్యవహరిస్తున్న బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసి విచారణ జరిపించాలని పి డి ఎస్ యు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
బీరం సుబ్బారెడ్డి HWO కొండనాగుల హాస్టల్ నాగర్ కర్నూల్ జిల్లాలో 2016 సంవత్సరం ఉద్యోగంలో ఉన్నప్పుడు అక్కడ హాస్టల్ లో ఉన్న 150 మంది విద్యార్థులకు అన్యాయం చేశాడని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగిందని. ఈ కేస్ పెండింగ్లో ఉండగానే ఉన్నత అధికారులను మభ్యపెట్టి, డబ్బులు ఇచ్చి ఆయన వనపర్తి జిల్లాకు ABCWO గా బదిలీ ద్వారా నియామకమై ( DBCWO) డి బి సి డబ్ల్యు ఓ ఇన్చార్జిగా వనపర్తి జిల్లాలో 15 హాస్టళ్లకు మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఇంచార్జ్ జిల్లా అధికారిగా 5 ఎస్టి హాస్టల్స్ కి నియమించడం జరిగిందని. ఇలాంటి అధికారి విద్యార్థులకు ఎలా న్యాయం చేయగలుగుతాడని ప్రశ్నించారు ఈయనపై ఏసీబీ రైడ్ 9-3-2016 లో జరిగింది క్రైమ్ నెంబర్( Crime number.) 86/RCO-HMR/2016 పై అధికారి అయిన బీరం సుబ్బారెడ్డి కొండనాగుల హాస్టల్ నాగర్ కర్నూల్ జిల్లాలో హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేసిన విషయాలు ఏమిటంటే విద్యార్థులకు రావాల్సిన కాస్మోటిక్ బిల్లులు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, ఫుడ్ ప్రొవియన్స్ ( కిరాణం) లాంటివి ఇవ్వకుండా మోసం చేసి ACB అధికారులకు దొరికిపోయాడు. అలాంటి అధికారిపైఉన్న మరో ఆరోపణపై LR Number. A2/350/2024 Date. 18/05/2024. BC సంక్షేమ కమిషనర్ తెలంగాణ హైదరాబాద్ Memo Number. A1/1703/2023,Date. 18/05/2024 ఈ కంప్లైంట్ లెటర్ ప్రకారంగా DBCWO సుబ్బారెడ్డి తో పాటు నలుగురికి విచారణ మేమో ఇవ్వటం జరిగింది.ఈ విచారణకు Date. 06/12/2024 ఉదయం 11 గంటలకు R/0 జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీస్ IDOC పాలకొండ మహబూబ్నగర్ విచారణకు హాజరవుటకు నిర్ణయించబడినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇందులో ఉన్న ప్రధాన ఆరోపణ దుప్పట్లు, అన్నం గిన్నెలు, గ్లాసులు మొదలైనవి బయట అమ్ముకోవడం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ (సుబ్బారెడ్డి) అధికారి 01/01/2023 నుండి ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగం నియమించినారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏమైనా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినారా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఎంప్లాయిమెంట్ సెలెక్ట్ చేశారు.
అన్న వివరాలు ఎవరికీ తెలియకపోయినా ఔట్సోర్సింగ్ వారి నుండి ఒక్కొక్కరి దగ్గర 50,000 వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. DBCWO సుబ్బా రెడ్డి కార్యాలయంలో వివిధ రూపాల్లో హాస్టల్స్ లో పని చేసే వర్కర్లను తీసుకువచ్చి తన సొంత పని కోసం వంట చేయడానికి, మరొకరిని కారును శుభ్రపరచుట కోసం, మరొకరిని ఆఫీస్ సెక్యూరిటీగా సొంత పనుల కోసం ఒకరిని సొంత ఇంటి పని కోసం ఒకరిని నియమించుకున్న వీరందరూ హాస్టల్లో చేయాల్సిన వారిని ఇక్కడ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి వీటిపై పూర్తిస్థాయి విచారణ చేసి తక్షణమే DBCWO సుబ్బారెడ్డి ని ప్రభుత్వానికి సరెండర్ చేసి చర్యలు తీసుకోవాలని . అలాగే వర్కర్లను వెంటనే వారు పని చేసే హాస్టళ్లకు పంపించాలని అలాగే బీసీ హాస్టల్స్ మనిటరింగ్ చేయడానికి , విద్యార్థినీ విద్యార్థులకు బాగోగులు చూడడానికి గవర్నమెంట్ వెహికల్ కేటాయిస్తే జిల్లా అధికారి సొంత పనుల కోసం వెహికల్ ఉపయోగించుకుంటూ, పనిచేసే వర్కర్లు డ్రైవర్లుగా పెట్టుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయ సదరు అధికారి జిల్లా బీసీ హాస్టల్ లో విద్యార్థినీ విద్యార్థులకు భగవద్గీత బుక్స్ పంపిణీ చేయటం జరిగింది. ఈ విషయం విద్యార్థుల మధ్య గొడవలకు దారి తీసినట్లుగా సమాచారం . ఈ భగవద్గీత పుస్తకాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదా లేక వనపర్తి జిల్లాలో ఉన్నదా అని తేల్చాల్సి ఉందని ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారిపై విచారణ జరిపి చట్టపరమైనచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో( PDSU) పి డి ఎస్ యు నాయకులు తయానా, ప్రవీణ్, రాజు,గణేష్, రాజశేఖర్, రాఘవేందర్ పాల్గొన్నారు
