హైదరాబాద్: అడ్డగోలు సంపాదనతో సమకూర్చుకున్న ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ అడ్డదారులు తొక్కాడు. అక్రమార్జనను సక్రమం చేసుకునేందుకు ఉనికిలో లేని వ్యాపారాలను సృష్టించాడు. తన భార్య, తల్లి, కూతురు, సోదరుడు, సోదరుడి భార్యను నిర్వాహకులుగా చూపుతూ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశాడు. ఆయా వ్యాపారాల ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు చూపెట్టేందుకు ఆదాయపన్ను రిటర్న్‌లు ఫైల్ చేశాడు. వివిధ దుస్తుల సంస్థలు నిర్వహిస్తూ డబ్బు సంపాదించినట్లు లెక్కలు చూపాడు. అలాగే తన కుటుంబంలోని ఓ మైనర్ ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించినట్లు చూపడం గమనార్హం. అలా సంపాదించిన సొమ్ముతోనే స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించాడు. అయితే అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో అతడి బాగోతం బహిర్గతం కాక తప్పలేదు. వ్యాపారాలు నిర్వహించినట్లుగా చెబుతున్న చిరునామాల్లో అనిశా తనిఖీలు చేయగా అంతా బోగస్ అని తేలింది. ఎప్పుడైనా చిక్కితే తప్పించుకునేందుకు వీలుగానే ఆ నకిలీ ఆదాయ మార్గాలను సృష్టించినట్లు అనిశా దర్యాప్తులో తేలింది.
ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…