SAKSHITHA NEWS

పౌరసేవలకు ఇంటి ముందుకే తెచ్చిన ఘనత సీఎం జగన్ దే: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
కందిపాడులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభం

గతంలో ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. కానీ సీఎం జగన్ పాలనలో అన్ని సేవలు ఇంటి ముందుకే వస్తున్నాయని చెప్పారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి.. చరిత్ర సృష్టించారన్నారు. బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్ నెస్ సెంటర్లను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో విద్య కోసం రూ.250 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఆస్పత్రుల కోసం 24 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు పూర్తి చేశామని.. మరికొన్ని త్వరలోనే పూర్తి చేశామన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కందిపాడులో సుమారు 5 కోట్ల మేర సంక్షేమ సాయం అందించామని, సుమారు 1.68 కోట్లతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కోసం రూ.73 లక్షలు మంజూరయ్యాయని.. త్వరలోనే ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామన్నారు. అంతకుముందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గ్రామంలో పర్యటించారు. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారు సూచించిన సమస్యలను అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కారానికి సూచనలు చేశారు.

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

బెల్లంకొండ మండలం కందిపాడులో సచివాలయ సిబ్బంది.. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారి సమక్షంలో సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాబిషేకం నిర్వహించారు. నిరుద్యోగులుగా ఉన్న తమ జీవితాల్లో కొత్త వెలుగు ఇచ్చారని చెప్పారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు.. వేతనాలు కూడా పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేశ్రీ నంబూరు శంకరరావు గారు మాట్లాడుతూ.. దేశంలో మన సచివాలయ వ్యవస్థ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉద్యోగాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాల కల్పించామన్నారు. సచివాలయ వ్యవస్థలో తొలి ఉద్యోగులు మీరేనని.. ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.


SAKSHITHA NEWS