దివంగత ముఖ్యమంత్రి . డా. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

Spread the love

దివంగత ముఖ్యమంత్రి . డా. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్ స్టాండ్ లోని మయూరి సెంటర్ నందు దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయబడుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2010 లోనే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నాటి కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అని వివరించారు. అందుకు సంబంధించిన తీర్మానంను కూడా విడుదల చేశారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా.. విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. కొందరు కావాలనే రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. అన్ని రకాల అనుమతులతోనే వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి కి ఘన నివాళి అర్పిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు-చైర్మన్లు, సర్పుంచ్లు, ఎంపీటీసీ, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇంఛార్జిలు, సొసైటీ డైరెక్టర్లు, డీలర్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page