SAKSHITHA NEWS

Focus on the safety of tourists…safety is primarily services.

పర్యాటకుల భద్రతపై దృష్టి …భద్రతే ప్రధానంగా సేవలు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్

సాక్షిత కర్నూల్ జిల్లా ప్రతినిధి

మంత్రాలయం దేవస్ధానం లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
పర్యాటక ప్రాంతాల్లో కియోస్క్ లు ఏర్పాటు . ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చే ప్రారంభం.మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్ ఏర్పాట్ల ను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి కెవి రాజేంధ్రనాథ్ రెడ్డి ( వీడియో కాన్ఫరెన్సు ఆన్ లైన్) వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.


రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తు లకు పోలీసు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పుంజుకుంటోందని, కరోనా కాల విరామం తర్వాత టూరిస్ట్ స్పాట్లకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారన్నారు. పండుగ, పర్వదినాలు, సెలవురోజుల్లో తాకిడి మరింతగా ఉంటోందన్నారు. ఇక వచ్చే వేసవి సెలవులన్నీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు ,బీచ్ లు, హిల్ స్టేషన్స్, అహ్లాదాన్ని పంచే ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, చారిత్రాత్మక ఆలయాలు ఇతర సందర్శనాత్మక ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

రాష్ట్రంలోని పర్యాటకులకు సంబంధించి భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పర్యాటకులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా ఇకపై ఈ టూరిస్ట్ పోలీసింగ్ విధానం సమర్ధవంతంగా అమలు కానుందన్నారు. పలు జిల్లాల్లో ఈ కియోస్క్ లు ఏర్పాటు చేశారన్నారు.ఆయా ప్రాంతాల్లోని టూరిస్టు ప్రదేశాలు ఉన్న పరిధి పోలీసు స్టేషన్లు అనుసంధానంగా టూరిస్టు పోలీసులు పనిచేస్తారన్నారు.

పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారన్నారు. భద్రతే ప్రధానంగా అన్ని చోట్ల ఏర్పాటు చేసిన కియోస్క్లు 6 గురు పోలీసులతో 24 గంటలూ సేవలందించనున్నాయన్నారు.
నదులలో దిగడం, దూకడం వంటి ఘటనలపై టూరిస్టు పోలీసులు ప్రధానంగా దృష్టి సారించనున్నారన్నారు. .

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ

ముఖ్యమంత్రి

వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చ్యువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, మంత్రాలయం సిఐ శ్రీనివాసులు, కమ్యూనికేషన్ సిఐ మనోహర్,మంత్రాలయం ఎస్సై వేణుగోపాల్ , మాధవరం ఎస్సై కిరణ్ , పోలీసు సిబ్బంది ఉన్నారు.


SAKSHITHA NEWS