శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం

Spread the love

శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట , నవగ్రహాలు ప్రతిష్ట మహోత్సవము పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట, నవగ్రహాలు, ప్రతిష్ట మహోత్సవము కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.

శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం, నవగ్రహాలు బొడ్రాయి ప్రతిష్టలు సందర్భంగా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది .

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలి గ్రామలో దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలలో భక్తి శ్రద్ధలతో దేవుని పూజించడం వల్ల శాంతి నెలకొల్పే గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి దేవాలయ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఐక్యతతో ఆ దైవ అనుగ్రహం తో గ్రామ , అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.

గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పం జరిగింది ‌.

గ్రామంలోని రైతులకు అభివృద్ధి చెందాలి పాడి పరిశ్రమ పరంగా అన్ని రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలి. ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగినది తెలిపారు.

హిందూ ధర్మాన్ని కాపాడాలి *

హిందువునని గర్వించు హిందువుగా జీవించు …

 ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మండలం పార్టీ అధ్యక్షులు డి.ఆర్ విజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర రెడ్డి ఆనంద్ రెడ్డి, గ్రామ పెద్దలు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page