First step on plastic ban from our municipal corporation - Mayor
ప్లాస్టిక్ బ్యాన్ పై మా నగరపాలక సంస్థ నుంచే తొలి అడుగు – మేయర్ శిరీషా, కమిషనర్ అనుపమ
*
…
……..
సాక్షిత తిరుపతి : ప్లాస్టిక్ బ్యాన్ పై మా నుంచే తొలి అడుగుగా వుండాలని తమ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టుతూ గాజు గ్లాసుల వినియోగాన్ని, మట్టి గ్లాసుల వినియోగాన్ని తీసుకు వస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ప్లాస్టిక్ బ్యాన్ పై మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంపై సమావేశం నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గొప్ప నిర్ణయం తీసుకురావడం జరిగిందని వివరిస్తూ, నవంబర్ ఒకటి నుండి వంద మైక్రాన్ లోపల వుండే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలిసి పోవడానికి దాదాపు 4 వందల సంవత్సరాల పైనే పడుతుందన్నారు.
ప్లాస్టిక్ వినియోగం వలన చర్మసంబంధ వ్యాదులు, పుట్టె బిడ్డల ఎదుగుదల సమస్యలు, అనేక అవయవాల క్యాన్సర్ వ్యాదులు వస్తున్నాయని మేయర్ వివరించారు. ప్లాస్టిక్ ను రూపుమాపేందుకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నేటి నుండి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడుతూ గాజు గ్లాసులు, మట్టి కప్పుల వినియోగాన్ని తీసుకు వస్తున్నట్లు మేయర్ డాక్టర్ శిరీషా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ ప్లాస్టిక్ ను అరికట్టెందుకు సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తిరుపతి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి, హనుమంత నాయక్, నరేంధ్రనాధ్, ఆంజినేయులు, తిరుత్తణి శైలజా, ఉమా, ఆరణి సంధ్య, దూది కుమారి, ఈశ్వరి, కో ఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, రుద్రరాజు శ్రీదేవి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈ విజయకుమార్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.