బాపట్ల జిల్లా
క్షతగాత్రురాలుకి ఆర్థిక సహాయం
అనారోగ్యంతో పట్టణంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు గుమ్మడి బుజ్జమ్మకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్య సమస్యలతో వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని శ్రీనివాసరావు చెప్పారు.తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి కార్యదర్శి బత్తుల సురేష్ మేధా శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు