రైతులు రోడ్లపై ధాన్యాన్ని పోసి వాహనదారులకు ఇబ్బందులు కలిగించొద్దు
రోడ్డు ప్రమాదాల నివారణ లో రైతులు భాగస్వాములు కావాలని కోరిన………….. *జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
*సాక్షిత వనపర్తి :
జిల్లాలోరైతులు రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని చనిపోయిన సంఘటనలు ఇప్పటివరకు చాలా చోటు చేసుకున్నాయని మన జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దని, ప్రమాదాలకు కారణం కావద్దని రైతులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కోరారు.
జిల్లా రైతులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ… రోడ్లపై ధాన్యం పోసి కల్లాలుగా మార్చడం వల్ల వాహనదారులు రాత్రి సమయాలలో కుప్పలను గమనించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. బావుల దగ్గర ఇండ్ల వద్ద లేదా సొంత పొలాల్లో ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ప్రత్యేకంగా కళ్ళాలను ఏర్పాటు . చేసుకోవాలని, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి వాహన దారులకు ఇబ్బంది కలిగించి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దని రైతులను కోరారు.
రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని వాహనదారులు వాటిని డీకొని చనిపోవడంవారి కుటుంబాలు అనాధలుగా మారడం జరుగుతుంది కావున
రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు విధిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకు రైతులు ప్రజలు సహకరించాలని ఎస్పీ తెలిపారు.