SAKSHITHA NEWS

విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు కూడా పోలీస్ కుటుంబ సభ్యులే – అడిషనల్ ఎస్పీ

పోలీసు సంక్షేమ దినోత్సవ సందర్భంగా వివిధ కారణాలచే మరణించిన, విరమణ చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎస్పీ

కృష్ణా జిల్లా పోలీస్ శాఖలలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చెందిన, వివిధ అనారోగ్య కారణాల దృష్ట్యా మరణించిన పోలీసు సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులతో పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్.వెంకట రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి పోలీస్ కుటుంబ సభ్యులతో అడిషనల్ ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి పోలీస్ శాఖ పరంగా సిబ్బందికి రావలసిన ప్రయోజనాలన్నీ అందినది లేనిది, ఇతర బెనిఫిట్స్ పొందడంలో ఉన్న ఇబ్బందుల గూర్చి, కుటుంబ సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున రావలసిన రాయితీలన్నీ త్వరితగతిన అందేలా చూస్తామని, పెండింగ్లో ఉన్న ఫైల్స్ గురించి పోలీస్ కార్యాలయ సెక్షన్ అధికారులతో మాట్లాడి అవి పూర్తి కావడానికి జాప్యం వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ పోలీస్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కొంతమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో విధులు నిర్వర్తిస్తూ మరణించడం జరిగిందని, వారు మరణించడం పోలీస్ శాఖకు తీరనిలోటు, అలాగే కుటుంబ పెద్ద పై ఆధారపడిన కుటుంబం యొక్క బాధను వర్ణించడం సాధ్యం కాదని, విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖలో లేనప్పటికీ వారి కుటుంబ సభ్యులైన మీరంతా పోలీస్ శాఖలో అంతర్భాగమేనని మీకు ఏ సహాయం కావాలన్నా అందించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని తెలిపారు. శాఖా పరంగా రావలసిన ప్రయోజనాలు ఎటువంటి జాప్యం లేకుండా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే విరమణ చెందిన పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైల్స్ అన్ని త్వరతగతిన పూర్తయ్యేలా చూస్తామని రావలసిన ప్రయోజనాలు అందాల చేస్తామని తెలిపారు.

పోలీసు వెల్ఫేర్ డే లో భాగంగా విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రావలసిన ప్రయోజనాలను చెక్కుల రూపంలో అడిషనల్ ఎస్పీ , ఏవో మూర్తి ,RI వెల్ఫేర్ శ్రీనివాస్ తో కలిసి బాధిత పోలీస్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

  1. ఎస్సై ఎస్ ఎల్ వి రమణ మరణానంతరం రావలసిన వీడో ఫండ్- 50,000/- రూపాయల చెక్కును ఆయన కుమారుడు తరుణ్ ఆనంద్ కి అందజేయడం జరిగింది.
  2. మరణించిన ఏఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు కి రావలసిన ఇన్సిడెంట్ చార్జెస్-25000/- , వీడో ఫండ్-50,000/- , కార్పస్ ఫండ్-1,00,000/- చెక్కులను ఆయన కుమారుడు రాజశేఖర్ కు అందజేశారు.
  3. ARSI -మహమ్మద్ నజీర్ అహ్మద్ కి మరణానంతరం రావలసిన ఇన్సిడెంట్ చార్జెస్- 25000/-, వీడో ఫండ్ – 50,000/- రూపాయల చెక్కులను ఆయన భార్య రజియా సుల్తానా కి అందజేశారు.
  4. దోబి పి.మస్తాన్ మరణానంతరం రావలసిన వీడో ఫండ్- 50,000/- రూపాయల చెక్కును ఆయన భార్య షరీఫా కి అందజేశారు.

SAKSHITHA NEWS