SAKSHITHA NEWS

ధరలు పెంచితే బతికేదెట్లా గ్యాస్ ధర తగ్గించాలిఉరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్.
సాక్షిత : కేంద్రం తీరును ఎండగట్టాలి
జడ్చర్ల శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు

ఊరుకొండ పేట బి ఆర్ ఎస్ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరల పెంపు పైన నిరసనగా ధర్నాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఊరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యులపై నడ్డి విడిచే విధంగా సిలిండర్ ధరలను పెంచిందని బిజెపికి మహిళలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా ఊరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ మోడీ సర్కార్ పెంచుతున్న ధరలకు బతుకులు చిన్న భిన్నమఅవుతున్నాయి నిత్యం చమురు ధరలు పెంచుతుండగా గ్యాస్ ధర పెంపుతో బండ ఇంక గుది బండగా మారనున్నది కేంద్రం పెంచుతున్న ధరలకు కళ్లెం పడితేనే నిత్యవసర ధరల పెంపు తగ్గుతుంది ప్రజలు ఉద్యమించి కేంద్ర సర్కార్ వైఖరిని ఎండగట్టాలి భారీగా గ్యాస్‌ ధరలు పెంచడంతో వినియోగదారులు సైతం భగ్గుమంటున్నారు.

ముఖ్యంగా గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారు విఫలమైందని పేదల బతుకులను చిందరవందర చేస్తున్నదని మండిపడుతున్నారు ఇలా ధరలు పెంచితే బతికేదెట్ల
రోజు రోజుకు గ్యాస్‌ ధరలు పెంచుకుంటపోతే ఎట్లా బతకాలి గతంలో500 ఉన్న గ్యాస్‌ ధర ఇప్పుడు రూ. 1240 అయ్యింది. ఇట్లా ప్రతీసారి పెంచితే ఎట్ల బీఆర్ఎస్ ఎప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇట్లా పెంచలేదు మళ్లీ కట్టెల పొయ్యిలు కాడ వండుకునే రోజులు వస్తున్నాయి. పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఊరుకొండ పేట దేవాలయ ధర్మకర్త మట్ట కలమ్మ. సోషల్ మీడియా అధ్యక్షుడు ఎండి అక్బర్. మండల నాయకులు రాజేష్. శ్రీశైలం. ఎజాస్. చంద్రయ్య. ఆంజనేయులు గౌడ్. తిరుమణి బాలు గౌడ్. మరియు గ్రామ యువకులు గ్రామ మహిళలు బీఆర్ఎస్ నాయకులు. ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS