గాజులరామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర ప్రారంభం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ఇలవేల్పుగా భావించే శ్రీ చిత్తారమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రతి ఏటా జరిగే అమ్మవారి జాతరకు ఈ ఏడాది కూడా ప్రజలంతా తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్ , కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ , ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బాలరాజు , ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ చిత్తారమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…