తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

SAKSHITHA NEWS

Everything should be done for the huge success of Tinmar Mallanna

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

  • కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో రఘురాం రెడ్డి పిలుపు
  • మార్పు ఆవశ్యకతను వివరిద్దాం: ఇన్ చార్జ్ రఘునాథ్ యాదవ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మoలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు.

పట్టభద్రుల వద్దకే మనం: రఘునాథ్ యాదవ్

గ్రామ గ్రామాన పట్టభద్రుల వద్దకు వెళ్లి.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత వివరిద్దామని ఎమ్మెల్సీ ఎన్నికల పాలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ రఘునాథ్ యాదవ్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం, పట్టభద్రుల వాణి వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో..రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, జెడ్పిటిసి బెల్లం శ్రీను, ఎంపీపీ మంగీలాల్, కాంగ్రెస్ రూరల్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు నెల్లూరి భద్రయ్య, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్, మద్ది మల్లారెడ్డి, రైట్ చాయిస్ అధినేత మెండెం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page