పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీలో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సమావేశం ఎల్లమ్మబండ పరిధిలోని అంబేద్కర్ నగర్ జన్మభూమి కాలనీ సుభాష్ చంద్రబోస్ నగర్ మరియు మహావీర్ నగర్ లోని సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. అధికారులే మన దగ్గరికి వచ్చారు కాబట్టి కాలనీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎటువంటి సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని తెలిపారు.

డివిజన్లో ఉన్న అన్ని కాలనీలలో ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని, అధికారులే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు రాజేష్ చంద్ర, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, బోయ కిషన్, దుర్గేష్, రహమాన్, విరేశం, హరీష్, షేక్ బీబీ, రాములుగౌడ్, అగ్రవాసు, జగదీష్, వెంకటేష్, మల్లేష్, అర్వరవి, కటికరవి, మౌలానా, ముజీబ్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, నరసింహులు, జగదీష్, ఫారూఖ్, ఖలీమ్, మీసాల జనయ్య, బాలరాజు, గోపి, రవీందర్, సతీష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. GHMC అధికారులు జలమండలి మేనేజర్ ఝాన్సీ, AE శ్రావణి, ఎంటమాలజీ AE ఉషారాణి, TPS సోమేశ్ , SRP సత్యనారాయణ, డాక్టర్ సౌమ్య, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, SFA మల్లేష్, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, జల మండలి సూపర్వైజర్ శివ, లైన్ మాన్ నరసింగరావు, రాంకీ సుధాకర్ రెడ్డి, పోలీస్ శాఖ మొహమ్మద్ కుడోస్ మియా మరియు రాములు సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page