SAKSHITHA NEWS

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఆశానగర్ లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం’ పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సమావేశం ఆశా నగర్, ఛత్రపతి శివాజీ నగర్, మహంకాళి నగర్, శంశిగుడా, అనసూయమ్మ మహంకాళి నగర్ కాలనీలలోని సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. ఇంచు మించు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదికను పంచుకోవడం జరుగుతుంది కాబట్టి కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియచేసారు. అలాగే సంబంధిత అధికారులందరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకట్ నాయక్, దాతి రమేష్, అంజయ్య యాదవ్, ఎం.శ్రీనివాస్, వెంకటకృష్ణ, పి.మహేష్, పోశెట్టిగౌడ్, స్వరూపా, పద్మకుమారి, సూరిబాబు, లక్ష్మణ్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. GHMC అధికారులు జలమండలి మేనేజర్ ఝాన్సీ, ఎంటమాలజీ AE ఉషారాణి, ఎంటమొలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, ఎలక్ట్రికల్ లైన్ ఇస్పెక్టర్ శ్రీనివాస్, జల మండలి సూపర్వైజర్ శివ, SFA మల్లేష్, రాంకీ సుధాకర్ రెడ్డి, పోలీస్ శాఖ జి.రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS