పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సమావేశం ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్, దత్తత్రయ కాలనీ, కమలమ్మ కాలనీ, శివమ్మ కాలనీలలోని సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా GHMC మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమంను చేపట్టడం జరిగిందని, కాలనీలలో ఉన్న పలు సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక అని, ఇంచు మించు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదికను పంచుకోవడం జరుగుతుంది అని అన్నారు.

కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియచేసారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు రాజేష్ చంద్ర, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, జగదీష్, వెంకటేష్, వెంకట్ యాదవ్, రామ స్వామి, నరసింహులు, సిద్దయ్య, రాజు పటేల్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, నాగరాజు, సంతోష్ బిరాదర్, దేవేందర్, కరణ్ సింగ్, మారుతి, శంకర్, శివ రెడ్డి, సుమిత, దుర్గమ్మ, తదితరులు పాల్గొన్నారు. GHMC అధికారులు జలమండలి మేనేజర్ ఝాన్సీ, ఎంటమాలజీ AE ఉషారాణి, TPS సోమేశ్వర్, డాక్టర్ సౌమ్య, అర్బన్ HA నాగరాణి, ఎంటమొలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, జల మండలి సూపర్వైజర్ శివ, లైన్ మాన్ నరసింగరావు, SFA మల్లేష్, రాంకీ సుధాకర్ రెడ్డి, పోలీస్ శాఖ శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page