సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి.
తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్
సాక్షిత : సమగ్ర ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తిరుపతి నియోజక ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో కమిషనర్ సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అన్ని పార్టీల నాయకులు తమ సిబ్బందికి సహకారం అందించాలని అన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. తమ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించాలని అన్నారు. మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఓటర్ల చేర్పులు తదితర విషయాల్లో ప్రజల నుండి వచ్చిన క్లైమ్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేశామని అన్నారు. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అన్నారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, ఈ. డి.టి. జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.