భారతదేశంలోని ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉండేదుకే ‘ఆయుష్మాన్ భవ’-ఎంపీపీ వైయస్సార్

Spread the love

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ లో ప్రభుత్వ ఆస్పటల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల ఫారం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉచిత వైద్యాన్ని అందించడం లేదు కానీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ఉచిత విద్య అందించాలని ఒక్కరికి ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందజేస్తున్నారని ఇప్పుడు మారుమూల ప్రాంతాలతో సహా లబ్ధిదారులందరికీ ఆరోగ్య సంరక్షణ పథకాలను వాంఛనీయంగా అందజేయాలని లక్ష్యంగా, భారతదేశంలో అన్ని గ్రామాలు ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆయుష్మాన్ భవ’ ను పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయుష్మాన్ భవ ID సృష్టించు కుంటి భారతదేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం అందుతుందని పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ఆకాంక్ష ఆయుష్మాన్ భవతో పేద ప్రజలకు దగ్గరవుతుందన్నారు. తెలంగాణ ప్రజల తరఫున మేడ్చల్ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page