సాక్షిత : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని కదం తొక్కి ముందుకు కదిలిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ బండారి లేఔట్ ప్రజలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కడుతున్నటువంటి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరుకు ఎంతగానో నచ్చిందని . తమ ప్రాంతంలోని సమస్యలపై ఎంత మొరపెట్టుకున్నా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ వస్తే గాని తమ ప్రాంత సమస్యలు తీరవని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి సమక్షంలో ధీమా వ్యక్తం చేసిన నిజాంపేట్ లోని బండారి లేఔట్ ప్రజలు.