దాతలు సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు వసతి షెల్టర్లు ఏర్పాటు.

Spread the love

పలువురు దాతల ఆర్థిక సహాయంతో..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో నిత్యము గ్రామ అభివృద్ధి కొరకు పారిశుద్ధ్యం విషయంలో గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గ్రామంలో సరైన వసతి గృహాలు లేకపోవడంతో షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ కట్టా శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాండ్ర నాగ మోహన్ రెడ్డి సహకారంతో పలువురు దాతలు ముందుకు వచ్చి ఈ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.ఈ మేరకు సర్పంచ్ నిర్మాణం పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు పంచాయతీ నిధులనుండి కాకుండా దాతలు మేడపాటి అప్పిరెడ్డి, గొలుగూరి సత్తిరెడ్డి(సత్తిలురెడ్డిఅల్లుడు) అను వారి సహకారంతో ఈ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా దాతలను పలువురు గ్రామస్తులు అభినందించారు.

Related Posts

You cannot copy content of this page