SAKSHITHA NEWS

Eluru District SP Rahul Dev Sharma distributed checks from IPS Widow Fund*

సాక్షిత : ఏలూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ అనారోగ్య కారణము వలన మరణించిన పోలీసు కుటుంబాల వారికి ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు కార్పస్ ఫండ్ మరియు విడో ఫండ్ నుండి రాబడిన చెక్కులను సిబ్బంది కుటుంబ సభ్యులకు పంపిణీ చేసినారు*

1) హెడ్ కానిస్టేబుల్ 51 ఏ.రమేష్ లక్కవరం పోలీస్ స్టేషన్ కార్పస్ ఫండ్ నుండి 1,00,000/- రూ.లు చెక్కు ను అతని బార్య కు

2) పోలీస్ కానిస్టేబుల్ 1522 వి.శ్రీను చేబ్రోలు పోలీస్ స్టేషన్ వారికి కార్పస్ ఫండ్ 1,00,000/- రూ.లు చెక్కు ను వారి భార్యకు

3). ఏ.ఎస్. ఐ 876 బి.వి.ప్రసాద్ ఏలూరు సి.సి.యస్ కార్పస్ ఫండ్ ను 1,00,000/- రూ.లు వారి యొక్క భార్యకు చెక్ ను అంద చేసినారు.

4). ఏ.అర్ పోలీస్ కానిస్టేబుల్ 127. వినోద్ Rs.1,00,000/- కార్పస్ ఫండ్ మరియు విడో ఫండ్ నుండి 1,00,000/- రూ.లు చెక్కు ద్వార ఆయా కుటుంబాల వారికి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ , ఐపీఎస్ వారు అంద చేసినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మరణించిన పోలీసు కుటుంబాల వారికి ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం అండగా ఉంటుందని వారికీ ప్రభుత్వం వారి వద్ద నుండి రావలసిన రాయితీల విషయాలలో తన వంతు కృషి చేస్తానని ఏదైనా సమస్య ఉన్న ఎడల తనని కలిసినియెడల వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకాలు నియమించేటందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ కుటుంబాల సభ్యులకు హామీ ఇచ్చినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కె.చక్రవర్తి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS