చిట్యాల మండలంలో ఘనంగా విద్యా దినోత్సవాలు
చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలంలోని
పెద్దకాపర్తి, నేరడ, పట్టణంలోని గ్రీన్ గ్రో పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని ,విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామలింగాచారి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు మరియు పాఠ్యపుస్తకాలను గ్రామ సర్పంచ్ మరి జలంధర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ ఆవుల మంజుల జానయ్య,వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్, ఏర్పుల సైదులు,ఉపాధ్యాయులు శకుంతల, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, జ్ఞానేశ్వరచారి, లుకేందర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కైలాసం, రోజా తదితరులు పాల్గొన్నారు.
నేరడ ప్రాథమిక పాఠశాలలో..
నేరడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా
వైస్ ఎంపీపీ మర్ల అలివేలు రాం రెడ్డి,గ్రామ సర్పంచ్ దుబ్బాక శోభ వెంకటరెడ్డి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రెబల్లే శరత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ గ్రో పాఠశాలలో..
చిట్యాల పట్టణంలో స్ధానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా అభివృద్ధి చెందించిందో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు తెలంగాణకు గర్వకారణమని జూన్ 20న ప్రత్యేకించి విద్యా దినోత్సవం జరపడం విద్యా వ్యవస్థకు కలమానికంగా ఉంటుందని విద్య వల్ల విద్యార్థులు క్రమశిక్షణ పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి పాఠశాల ఏఓ పోలా గోవర్ధన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.