ముత్యాల ముగ్గుల పోటీలను శంకర్పల్లి మండల కేంద్రంలోని రేవతి హై స్కూల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా చేవెళ్ల నియోజక వర్గం ఇన్చార్జి పామెన భీంభరత్ సతీమణి జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దీపా మహాలింగాపురం రూ.3వేల నగదు, రెండవ బహుమతి భాగ్యలక్ష్మి సింగాపురం కు రూ.2వేలు, మూడవ బహుమతి రాజేశ్వరి శంకర్పల్లి కి రూ. వెయ్యి నగదు అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల గ్రామ సర్పంచ్ శైలజ రెడ్డి, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దేవర సమత వెంకట్ రెడ్డి, నాయకులు ఉదయ్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇజాస్, అనంత్ రెడ్డి, ప్రశాంత్, శ్రీకాంత్, శంకర్, మహబూబ్ హుస్సేన్, మల్లికార్జున్, మోసిన్, సుధాకర్ రెడ్డి, అస్లాం, షారు, వెంకట్ పాల్గొన్నారు.
శంకర్పల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు: పామెన జ్యోతి భీమ్ భరత్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…