దసరా పండగ జీతాలు ఇస్తారా ఇవ్వరా లేక దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటివెలుగులులో నెట్టుతార
నగరిలో 8 వ రోజు కొనసాగుతున్న హాస్పిటల్ లో పని చేయు పారిశుద్ధ కార్మికుల నిరసన ధర్నా............. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేసే కార్మికులు రావలసిన పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఎనిమిది రోజు నగరి పట్టణంలో ర్యాలీ చేపడుతూ టవర్ క్లాక్ సెంటర్ నందు రోడ్డు పైన బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ వైద్య శాఖ అధికారులు హాస్పిటల్ పరిశుభ్రత పైన , కార్మికులకు జీతాలు ఇప్పించడం లోను నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రభుత్వం వెంటనే కార్మికులకు జీతాలు వెయ్యాలి, రాష్ట్ర అధికార యంత్రాంగం సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వైద్య అధికారులు(DCHO) సమస్యలు పరిష్కారం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కార్మికులను ఆదుకునేది ఎవరు సూటిగా ప్రశ్నించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యా, హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించేందుకు, కార్మికుల సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ అందుబాటులోకి రారు, వారి జీతాలు ఇచ్చేదానికి ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలి.ఎనిమిది రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలియ పరుస్తున్న కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, జీతాలు వేయకపోతే నగిరి ఆర్డీవో కార్యాలయాన్ని రేపు అనగా మంగళవారము ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ,అలోపు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు వేలన్, భాష,శేఖర్ ప్రభాకర్ హాస్పిటల్ యూనియన్ నాయకులు నగోమి, సుమ నాయకులు నగొమి,రూతు సుమతి సేళ్వి జెర్సీ చంద్రమ్మ సుజాత శాంతి మల్లికమ్మ రాజశేఖర్ కార్మికులు పాల్గొన్నారు