సిఐ రామచందర్ రావు ఆధ్వర్యంలో వైభవంగా దసరా మరియు ఆయుధాల పూజ

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లోని సిఐ రామచందర్ రావు ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా దసరా మరియు ఆయుధాల పూజ జరిగింది

పోలీసులందరు కలసి వేడుకలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ రామ్ చందర్ రావు ఆద్వర్యంలో వేదపండితుడు ఆయుధ పూజ నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో జమ్మి చెట్టు వద్ద పోలీసులు పూజలు చేశారు.జమ్మి ఆకును తీసుకొని ఒకరికొక్కరు అభినందల తో అందరు కలిసి ఇచ్చి_ పుచ్చుకున్నారు. దసరా పండగ ను పోలీసులు సంతోషంగా గడిపారు. జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు పూజారి చేయించారు. పోలీసులతో శమి శమయతే పాపం శ్లోకాన్ని రాయించి జమ్మి చెట్టుకు పెట్టించారు.తమ కోరికలు నెరవేరాలని జమ్మిచెట్టుకు పోలీసులు మొక్కులు మొక్కుకున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page