SAKSHITHA NEWS

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

అలాగే ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్‌ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి.

దారి మళ్లింపు..
ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్‌ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఏప్రిల్‌ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (11019), ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు ధనాబాద్‌ – అలప్పుజ (13351), ఏప్రిల్‌ 4, 11, 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్‌ (18111), ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్‌ – తాంబరం (12376), ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.

WhatsApp Image 2024 03 27 at 3.35.38 PM

SAKSHITHA NEWS