SAKSHITHA NEWS

Drone machine with entomology staff in Ambir pond

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్ వద్ద ఉన్న అంబీర్ చెరువులో ఎంటోమొలజీ సిబ్బందితో కలిసి డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రభలుకుండ ముందస్తు నివారణ చర్యలుగా ఎంటమాలజీ సిబ్బంది తో డ్రోన్ యంత్రం సహాయం తో దోమల మందు పిచికారీ చేయించడం జరిగినది అని, మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని,

పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి రోగాలు దరిచేరవు అని, పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ జోనల్ ఆఫీసర్ లచ్చి రెడ్డి, సూపర్వైజర్ డి. నరసింహులు, మురళి, మధు వారి సిబ్బంది, కాలనీ వాసులు రాజుసాగర్, రేణుక తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS