చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: డా. ప్రసూన సంతోష్

Spread the love

చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: డా. ప్రసూన సంతోష్

శంకర్‌పల్లి: నవంబర్ 14: (సాక్షిత ): ప్రధాని మోడీతోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం కూతురు డా. ప్రసూన సంతోష్ పేర్కొన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డులో మంగళవారం ఆమె స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కె ఎస్ రత్నం కు ఓటు వేసి గెలిపిస్తే చేవెళ్ల నియోజకవర్గం మరింతగా అభివృ ద్ధి చేస్తాడని హామీ ఇచ్చారు. తన తండ్రి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ప్ర స్తుతం కనిపిస్తున్నదని, ఎమ్మెల్యే యాదయ్య చేసింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్రం లోని ఆయా గ్రామాలలో జరుగుతున్న అభి వృద్ధి కోసం ఖర్చు చేసే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేనని, సిమెంట్ రోడ్లు, గ్రా మపంచాయతీ భవనాల నిర్మాణం నిధులు, స్మశాన వాటికల నిర్మాణం, రైతు వేదికలు నిర్మాణం తదితర వాటిలో అన్నింటా కేంద్రం వాటా ఉందనే విషయాన్ని బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తెరగాలని అన్నారు.

మద్యం ద్వారానే రాష్ట్రానికి 40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా కేవలం ప్రభుత్వం పేదలకు అందజేసే పథకాలన్నింటికి 25 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. మధ్య నిషేధం చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన ఘనత బీజేపీకి దక్కిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడ్డ తెలంగాణ నేడు ఎవరు పాల యిందని ప్రశ్నించారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ దొరల పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వమే ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుండగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కిలోలు ఇస్తుందో.. ప్రజలు తెలుసుకోవాలని డా. ప్రసూన సంతోష్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కుమారస్వామి, శ్రీధర్ రెడ్డి ఉన్నారు.

Whatsapp Image 2023 11 14 At 19.53.06

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page