పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *
*సాక్షిత : * పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట పట్టణంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పల్నాడు జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల పరంగా రొంపిచర్ల మండలంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు.
ఓటీఎస్ ద్వారా పట్టా లాండ్ లో ఉన్న వారికి ఇంకా పట్టాలు రాలేదు అని… నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంతంలో చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారని అన్నారు. వారందరికీ పట్టాలు ఇవ్వడమో లేక కట్టినా డబ్బును వెన్నకి ఇప్పించడమో చేయాలి అన్నారు. ఎన్ఆర్జీఎస్ పెండింగ్ నిధులు త్వరగా విడుదల చేయాలి అని కోరారు.
పమిడిమర్రు స్కూల్ ను నాడు నేడు ద్వారా యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించాలి అని కోరారు. జల్ జీవన్ మిషన్, వైద్య ఆరోగ్య శాఖ లో నాడు నేడు పనులు గురించి ప్రస్తావించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తరుణంలో చేపట్టిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే తిరిగి ఆయా ప్రాంతాల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించడానికి అవకాశం ఉంటుందన్నారు.