SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

న్యూ హోప్ అసోసియేషన్( ఐ ఆర్ సి ఏ) చిట్యాల అధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సోమవారం రోజు నేరడ గ్రామంలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.న్యూ హోప్ అసోసియేషన్ కౌన్సిలర్ గోవర్ధన్ మాట్లాడుతూ మత్తు పదార్థాల దుర్వినియోగం వలన జరిగే నష్టాల పై ప్రజలకు వివరించడం జరిగింది.

ముఖ్యంగా యువత మద్యపానం మరియు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలపై దృష్టి కేంద్రీకరించాలని అలాగే పిల్లల ముందు మద్యపానం సేవించడం చేయకూడదని దానివల్ల అనారోగ్యం బారిన పడి జీవితం చిన్నాభిన్నం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్ ఎడ్యుకేటర్ కుమార స్వామి, స్వప్న, విజయ, నిష, ప్రభాకర్, వెంకన్న, శ్రీను, వీరమల్ల అరుణ్, పిల్లలమర్రి శ్రీను, కల్లూరి శత్రజ్ఞ గౌడ్, కడారి శ్రీను,గుర్రం బిక్షం,వరికుప్పల ఇద్దయ్య,రూపని శ్రీను,రూపని వెంకన్న, రూపని రవి తదతరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS