SAKSHITHA NEWS

జిల్లా వ్యాప్తంగా అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మానవపాడు మండల ఎస్ఐ రాము తన పోలీస్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాము మాట్లాడుతూ…మండల ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు.18 ఏళ్లు దాటిన వారంతా చట్టపరంగా మోటార్‌ వెహికల్‌ లైసెన్సులను తీసుకోవాలన్నారు. పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తల్లిదండ్రులు శిక్షకు అర్హులు అవుతారని తెలిపారు.

జాతీయ రహదారులపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం చేయకూడదు అని అన్నారు.డ్రైవింగ్‌ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు కండీషన్లో ఉండకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రయాణంలో మొబైల్‌ వాడకం, మద్యపానం, అతి వేగం వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని హెల్మెట్ ఉన్నట్లయితే చిన్న చిన్న గాయాలతో బయటపడే అవకాశం అధికంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ వాడాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ప్రమాదాల పై అవగాహన కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినప్పటికీ చాలామంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నారన్నారు. అధిక వేగంతో, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఇలా ఎన్నో విధాలుగా చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, హెల్మెట్ ధరిస్తే హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందన్న ఉద్దేశంతో కొంతమంది యువకులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతారన్నారు. హెల్మెట్ ఉన్నట్లయితే వారి విలువైన ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని మండల ప్రజలకు ఎస్ఐ తెలిపారు.

అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మరణాలు సంభవించడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని,వైకల్యం చెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు.యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రజల రక్షణనే పోలీస్ ల ద్వేయం అన్నారు.రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

WhatsApp Image 2023 09 29 at 1.48.08 PM

SAKSHITHA NEWS