అనకాపల్లి,
సబ్బవరం పిఎస్ లో ట్రాఫిక్
హోంగార్డు గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన కె.కోటేశ్వరరావు హెచ్.జి. నెం.148 కు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు వేతనం రూ.3,86,950/- చెక్ ను తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. అనకాపల్లి మరియు సబ్బవరం పి.ఎస్ లలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ కష్టపడి పనిచేసి, ప్రజల ప్రశంసలు పొంది, పోలీసు శాఖ కు మెరుగైన సేవలు అందించాడని ఈ సందర్భంగా హోంగార్డు కోటేశ్వరరావును అభినందించారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు ఎవరైనా విధి నిర్వహణలో మరణించిన లేదా పదవీ విరమణ పొందిన వారికి ఆర్ధికంగా ఆదుకునేందుకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా లలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా వారికి వచ్చే ఒక రోజు వేతనం ను ఆర్థిక సహాయంగా అందచేస్తారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయ భాస్కర్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనధికారి శ్రీమతి బి.శారద, సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి డి.భవాని పాల్గొన్నారు.