SAKSHITHA NEWS

District Review Board meeting was presided over by District In-charge, State Education Minister Botsa Satyanarayana

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు,జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తోపాటు పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇంచార్జ్ మంత్రి డా సీదిరి అప్పలరాజు .

ఈసందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. శివారు ప్రాంతాల్లో ఉన్న భూములకు సాగు అందించే అవకాశాన్ని గూర్చి చర్చించారు. డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ పోలాకి మండలంలో ఇంత వరకు కొన్ని భూముల్లో వరి నాట్లు జరగలేదని, సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో పంట పొలాల్లోకి సముద్ర నీరు వస్తుందని, వరి నారు ముదురుపోయిందని చెప్పగా బూస్టర్ డోస్ వేయాలని, ఎరువులు రెండు సార్లు వేయాలని, శాస్త్రవేత్తలను ఒకసి తీసుకువస్తామని జెడి చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ తీర ప్రాంత రైతులకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన పరచాలని జెడిని ఆదేశించారు. అలాగే హైస్కూల్ అప్ గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలు ఏర్పాటు చేసిన వాటి గూర్చి మాట్లాడడం జరిగింది.పలాస మండలంలో రెండు హైస్కూల్లు అప్ గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు

 ఈ సమావేశంలో మాజీ మంత్రి, శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, జిల్లా ఎస్పీ రాధిక, శాసన సభ్యులు రెడ్డి శాంతి,శాసన మండలి సభ్యులు పివిఎన్ మాధవ్,శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్,పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, డిసిఎంఎస్ అధ్యక్షులు చల్లా సుగుణ, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. సువర్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్,వంశధార ఎస్ఈ డోల తిరుమలరావు,ఆర్డబ్ల్యుఎస్ ఎఇ వర ప్రసాద్,సమగ్ర శిక్ష ఎపిసి జయప్రకాష్,గృహ నిర్మాణ శాఖ పిడి గణపతిరావు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. మీనాక్షి,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS