కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫుననిరుపేద ముస్లిం సోదరులకు 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

Spread the love

.నిరుపేదల కష్టాలు తెలిసిన పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి

కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్ల వంశీచంద్ రెడ్డి ఆదేశాల నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం 500 మందికి నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీకల్వకుర్తి పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి.

రాబోయే ఎలక్షన్ లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరుజిల్లా ఎస్సీ సెల్ మల్లేపల్లి జగన్

కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ చల్ల వంశీ చంద్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మైనార్టీల కష్టసుఖాలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ తరపున 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు ఉండి సంవత్సరంలో ఎంతో ఘనంగా జరుపుకునే రంజాన్ పండుగ రోజు నిరుపేదలకు అండగా నిలిచి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం 500 మందికి 8 రకాల నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ మల్లెపల్లి జగన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి. కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి. సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిరుపేద మైనార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున 500 మందికి నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసం ఉండి జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అని ప్రతి నిరుపేద ముస్లిం సుఖ సంతోషాలతో పండుగను జరుపుకునే విధంగా నిరుపేద మైనార్టీ లకు 500 మందికి నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని ముస్లిం మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర యువజన కార్యదర్శి చంద్రకాంత్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పర్శపాకుల శేఖర్. బ్లాక్ బీసీ విభాగం అధ్యక్షులు గోపాల్. బ్లాక్ బీసీ విభాగం ఉపాధ్యక్షులు సైదులు. కల్వకుర్తి మండలం మైనార్టీ నాయకులు మహిముద్ భాయ్. ఎస్టీ సెల్ అధ్యక్షులు దాస్య మైనార్టీ సెల్ షాకీర్ బాయ్. ఎస్సీ సెల్ టౌన్ ఉపాధ్యక్షులు కరణ్. మాజీ వార్డ్ మెంబర్స్ శంకర్ నాయక్. ఆంజనేయులు యాదవ్. సేవాదళ్ ఆరిఫ్. నాని యాదవ్. కోడల గణేష్. శ్రీకాంత్.సంజాపురంఆంజనేయులు.మైనార్టీ నాయకులు రఫీ.ఖజా. అబ్బు.అమీర్. షంషేర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page