SAKSHITHA NEWS

మా సేవలను గుర్తించి ఉద్యోగాలు కొనసాగించండి
— గురుకుల అసిస్టెంట్ కేర్ టేకర్స్(ఏసీటీ)
— గురుకుల జోనల్ సమన్వయ అధికారి స్వరూపరాణి కి వినతి
— 10 సంవత్సరాలుగా సెలవులు లేకుండా తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేస్తున్నాము

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

గత 10 సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉండి ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా, తక్కువ వేతనానికి సెలవులు లేకుండా ఎక్కువ సమయం కేటాయించి, కరోనా లాంటి భయంకర సమయంలో కూడా గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేశామని మా సేవలను గుర్తించి అసిస్టెంట్ కేర్ టేకర్స్(ఏసీటీ)గా మా ఉద్యోగాలు కొనసాగించాలని గురుకుల జోనల్ సమన్వయ అధికారి స్వరూపరాణి ని కలసి బుధవారం అసిస్టెంట్ కేర్ టేకర్స్(ఏసీటీ) వినతిపత్రం అందజేశారు.

అందుకు జెడ్సీవో స్వరూపరాణి సానుకూలంగా స్పందించి గురుకుల సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లి తన వంతుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కేర్ టేకర్స్(ఏసీటీ) మాట్లాడుతూ…
గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాలని గురుకుల కార్యదర్శి ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం అయోమయానికి గురిచేసిందని, ఎటువంటి లోపాలు లేకుండా తక్కువ వేతనానికి గురుకులాల్లో పనిచేస్తున్నామని, సమాచారం ఇవ్వకుండా ఒక్కరోజులో అన్యాయంగా మమ్ములను తొలగించి మా కుటుంబాలను రోడ్డును పడేయడం న్యాయం కాదన్నారు.

తక్షణమే మమ్ములను ఉద్యోగాల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా అందరిని క్రోడీకరించి, పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగాలు సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దార మమత, సుజాత, లత, కొరకొప్పుల సునీత, వీర నాగమణి, సుశీల, దుర్గ, సరస్వతి, శిరీష, మందుల రమాదేవి, అనిత తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS