కూలి పనికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మునిసిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు నందు గల రైస్ మిల్లు వద్ద నివాసం ఉండే రాచూరి జయమ్మ (24) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. జనవరి 27వ తేదీన ఉదయం పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరింది. గత 12 రోజుల నుండి చుట్టుపక్కల, బంధువులు,
తల్లి గారింటి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. మహిళ చామన చాయ రంగు, నల్లటి జుట్టు, గుండ్రని ముఖం, బ్లూ కలర్ టాప్ రెడ్ కలర్ లెగ్గిన్ ప్యాంటు ధరించి ఉన్నదని సీఐ తెలిపారు. వివాహిత తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కూలి పనికి వెళ్లిన వివాహిత అదృశ్యం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…