దివ్యాంగులు,వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

Spread the love

ఓటు హక్కు భారం కాదు మన బాధ్యత : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

…….

సాక్షిత సూర్యాపేట జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటు అవశ్యకతపై వృద్ధులు, వికలాంగులు అలాగే ట్రాన్సజెండర్స్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం కల్పించిన సదుపాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో మొత్తం వృద్ధులు 17216 మంది ఉండగా వారిలో 85 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు 6425 మంది , ట్రాన్స్ జెండర్స్ 55, అంగవైకల్యం ఉన్నవారు13421. కలరని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో గుర్తించిన కేంద్రాల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా 729 వీల్ చైర్, ఆటో సదుపాయం, వాలంటరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులు 96 శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్ లకు ఓటు అవశ్యకతపై స్వీప్ కార్యక్రమాలు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. పోలింగ్ రోజున 85 పైబడిన అలాగే మంచానికే పరిమితమైన వారికి హోమ్ ఓటింగ్ సద్వినియోగం చేసుకునేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ ల 729 ప్రాంతాల్లో సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా సంక్షేమ అధికారి వెంకట రమణ మాట్లాడుతూ దివ్యాంగులకి,వయో వృధ్ధుల కి, ట్రాన్స్ జెండర్స్ కోసం వారి ఓటు హక్కు వినియోించుకోవడానికి eci నిబంధనల మేరకు జిల్లా ఎన్నికల అధికారి సూచనలనుసరించి అన్ని ఏర్పాటు చేయటం జరిగినదని ప్రతి ఒక్కటి ఓటు అవశ్యకతపై అవగాహన కల్పిస్తూ నూరు శాతం ఓటు హక్కు సద్వినియోగం అయ్యేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.

తదుపరి వయో వృద్ధులు హమీద్ ఖాన్, విద్యా సాగర్, లక్ష్మయ్య, సోమయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్క వృద్ధుడు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక వెసులుబాటు హర్షణీయం గత అసెంబ్లీ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్, కల్పించిన సదుపాయాలు అభినదనీయమని హర్షం వ్యక్తం చేశారు.

వికలాంగులు నయీమ్, కె.సైదులు, లింగయ్య, చింత సతీష్ అలాగే మధన చారి, జహీర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో eci నిబంధనల మేరకు జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు సంతృప్తిని ఇచ్చామని హోమ్ ఓటింగ్ 96 శాతం వికలాంగులు సద్వినియోగం చేసుకున్నారని ఈ సారి కూడా అదేవిదంగా సదుపాయాలు కల్పించడం తో నూరు శాతం ఓటింగ్ జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ట్రాన్స్ జెండర్స్ శ్రీలేఖ, రవలి, సాక్షి అలాగే చందిని లు మాట్లాడుతూ సమాజంలో మపై ఎలాంటి వివక్ష చూపకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కల్పించిన సదుపాయాలతో నేరుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నామని గత అసెంబ్లీ లో ఓటు హక్కును వినియోగించుకున్నామని ఈ సారి కూడా ఓటు సద్వినియోగం చేసుకుంటామని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఐ డి కార్డులు అందచేసారని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు.

 ఈ సమావేశంలో dwo  వెంకటరమణ, cdpo లు కిరణ్మయి, శ్రీవాణి, శ్రీజ, రూపా, సాయి గీత సూపర్ వైజర్లు జగతి కళాశాల ప్రిన్సిపాల్ మెగోమి, దివ్యాంగ విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page