హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. నేడో రేపో ప్రభుత్వం కొలువుదీరనుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు చేసిన కృషి ఫలించింది. ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
కేసీఆర్ ఓడించాల్సిందే అంటూ అన్ని జిల్లాల్లో, ప్రతి మీటింగ్ లో చెబుతూ వచ్చారు. కేసీఆర్ ఓడించాలంటే అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించారు కూడా.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాదు..కాంగ్రెస్ పూర్తి మద్దతు కూడా ప్రకటించారు. టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్తో పనిచేయాలని సూచించారు.
వీరి కృషి ఫలించి కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రిపదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉన్నత విద్యావంతుడైన కోందండరాంను శాసనమండలికి పంపి ఆయనకు విద్యాశాఖను కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన్ను మంత్రిగా చేయటం కుదరకపోతే.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తోందట.