Dharnas should not be held on roads for compensation
నష్టపరిహారం కోసం రహదారులపై ధర్నాలు రాస్తారొకలు చేయరాదు
పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్
సాక్షిత పెద్దపల్లి బ్యూరో : పెద్దపల్లి జిల్లాలొ ప్రమాదంలో గాయపడిన లేదా చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు రహదారులపై ధర్నాలు రాస్తారొక లు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, వాహదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దపల్లి సీఐ హెచ్చరించారు.
ఈ మధ్యకాలంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కల గూడూరు, పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు నష్టపరిహారం కోసం కొంతమంది స్వార్థం మరియు స్వలాభం పొందే వారి ప్రోద్బలంతో రోడ్లపైకి వచ్చి రాస్తారోకలు ధర్నాలు చేయడం జరిగింది.
ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన సాధారణ ప్రజలకి వాహనదారులకి ఇబ్బంది కలుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావు. బాధితులకు ఏదైనా నష్టపరిహారం కావాలనుకుంటే చట్టపరంగా గౌరవ కోర్టుల ఆదేశాలు, నిర్ణయం ద్వారా పొందాలి. అలాకాక ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రతి విషయాన్ని వీడియోలు ఫోటోలు తీసి వైరల్ చేసి, పేరు సంపాదించాలనే దురుద్దేశంతో సంఘటనకు సంబంధించిన బాధితులను వారి కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను ప్రలోభాలకు గురిచేసి ధర్నాలు రాస్తరోకలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అని వారిని ప్రోత్సహించి రోడ్లపై బైఠాయించే విధంగా ప్రేరేపిస్తున్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే కొంతమంది జాబితా సిద్ధం చేయడం జరిగింది వారిపై త్వరలోనే చట్టమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా వీరి మాటలు విని ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.