సిర్గాపూర్ మండలం వంగ్గల్ గైరాన్ తాండాకు రోడ్డు వేయాలని తాండవాసులతో కలిసి ధర్నా
లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ మాట్లాడుతూ సిర్గాపూర్ మండలంలోనీ వంగ్గల్ గ్రామ నుండి గైరాన్ తండాకు వెళ్లే దారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తండా ప్రజలు గ్రామానికి రావాలంటే మంచం లేదా ట్రాక్టర్ సాయంతో వెళ్లి పరిస్థితి నెలకొంది తండాలో ఎవరికైనా ప్రమాదం జరుగుతే అంబులెన్స్ రాదు బైక్ వేళ్ళని పరిస్థితి ఉంది వర్షం వస్తే చాలు చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్న ఎవరికైనా ప్రమాదం జరిగినా రాకపోకలు పూర్తిగా ఆగిపోతే బ్రిడ్జి లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్న తండావాసులు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు సదుపాయాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేసారు వర్షం వస్తే ఇంట్లో నీరు చేరుతుంది ఇంట్లో పాములు రావడం జరిగింది చిన్న పిల్లలకు అనేక రోగాలు రావడం పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు గత సంవత్సరం కచ్చితంగా మేము ఈ గైరాన్ తాండకు రోడ్ వేస్తాం బిరుదు నిర్మాణం చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ కనీసం పనులను ప్రారంభించకుండా కేవలం ఎన్నికల కోసమే మోసం చేసి ప్రజలను ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ఈసారి భూపాల్ రెడ్డి గారిని ఓటుతో కచ్చితంగా ఓడకూడదని హెచ్చరించారు మీరు గత సంవత్సరం ఇదే నెలలో చెప్పడం జరిగింది అన్ని తాండలకు రోడ్డు వేయడం జరుగుతుంది 100 కోట్లతో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎందుకు ఈ తండాలవైపు చూడడం లేదు తాండలవైపు ఎందుకు సవిత తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి మా మీద కాదు మీ ప్రెస్ మెట్ తండాలో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉంది తండా ప్రజలు చాలా భయంతో బతుకుతున్నారు ఇల్లు సరిగా లేదు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిచలేదు తండాలు ప్రజల ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది కావున మీరు తండాకు రావాలి మీ సవాల్ కు మేము సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమా అని అన్నారు దశాబ్ది ఉత్సవాలు చేస్తా ఉన్నారు కానీ గిరిజనలకు భాగ్య సామ్యం లేదు గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు తండాలకు రోడ్డు లేదు అదే విధంగా బడ్జెట్ లేదు చెరుకు వలస అనేక ఇబ్బందులతో గిరిజనులకు గురవుతున్నారు ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించింది అని చేస్తా ఉన్నారు ప్రభుత్వం మొండి దగ్గరతో గిరిజనులకు వేల కోట్లు తీసుకొస్తున్న అని చెప్పేసి అంటున్న ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ పోతున్న నిధులు తాండలి వైపు వర్షం వస్తే ఇప్పుడు భయం పరిస్థితి వర్షాకాలం రాబోతుంది ఏ తండాలో ఎక్కడ రోడ్డు వేసి చర్చకు రావాలి అని అన్నారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజనులకు ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల గిరిజన బంధు కింద ఆర్థిక సాయం అందించాలి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ వాసు,శ్రీనివాస్, వినోద్ నాయక్ కిషోర్ గోవింద్ రాజు శంకర్ గణపతి దూప్ సింగ్ తండా వాసులు పాల్గొన్నారు.