SAKSHITHA NEWS

ధరణి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి……… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

సాక్షిత వనపర్తి ఆగస్టు3
జిల్లా లో
ధరణి లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి కలెక్టర్ లాగిన్ కు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం ధరణి దరఖాస్తుల పెండింగ్ పై ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ రెవెన్యూ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధరణి కేసులు పెండింగ్ లేకుండా వచ్చిన రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని, ఒక వేళ దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తె అందుకు గల నిర్దిష్టమైన కారణాలను చూపిస్తూ తిరస్కరించాలని కలెక్టర్లను సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆర్డీఓ, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ధరణి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ముఖ్యంగా సక్సెషన్, మ్యూటేషన్ వంటివి లాగిన్ లో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో, తహశీల్దార్లను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.నగేష్, ఆర్డీవో పద్మావతి, ఏ. ఒ భానుప్రకాష్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS