హైదరాబాద్
పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో ఆయా విభాగాల్లో కొత్తగా నియామకం కానున్న 14,881 మందికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణాకేంద్రాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శిక్షణాకేంద్రాల్లో ఏర్పాట్లపై శిక్షణావిభాగం ఐజీ తరుణ్ జోషితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ శిక్షణాకళాశాలల ప్రిన్సిపాళ్లతో డీజీపీ తన కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు, అక్టోబరు నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులు ప్రారంభం కావడానికి ముందుగానే పీటీసీల్లో మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణకు కావాల్సిన పరికరాలు, వసతి సౌకర్యం ఇతర అన్నింటిని ఏర్పాటు చేసుకోవాలని, మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
28 పోలీస్ శిక్షణా కేంద్రాల్లో 14,881 మందికి శిక్షణ: డీజీపీ
Related Posts
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…