అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగు రంగుల గోడలు కాదు
ప్రతి పేదవాడి నైతిక అభివృద్దే దేశ,రాష్ట్ర అభివృద్ధి
పక్క జిల్లా లో జరిగిన అభివృద్ధి కంటే ములుగు జిల్లా లో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి జరిగిందో మంత్రులు సమాధానం చెప్పాలి
పైలట్ ప్రాజెక్టు క్రింద ములుగు హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించి రక్తాలు గుంజుకున్నరు రిపోర్ట్ లు ఇవ్వాళే
కోట్ల రూపాయలు వెచ్చించి రేడియాలజీ సెంటర్ ప్రారంభించారు మూలన పెట్టిర్రు
విభజన చట్టంలో ములుగు కేంద్రములో గిరిజన యూనివర్సిటీ కేటాయించారు ఇప్పటికీ 10 యేండ్లు అవుతుంది తరగతులు ప్రారంభించ లేదు
దేశం లో బిజెపి,రాష్ట్రంలో బిఆర్ఎస్ రెండు ఒక్కటే
త్యాగాలు మావి భోగాలు బిజెపి బిఆర్ఎస్ పార్టీలవా
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ…
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బి.ఆర్.ఎస్. నియంత పాలన చేస్తూ, ప్రజలను హింసిస్తుందని వ్యాఖ్యానించిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు…
తేదీ: 29.08.2023 మంగళవారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు దనసరి సీతక్క గారు విచ్చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అవినీతి పాలకులకు చిక్కి నాశనం అయిందని, ధనిక రాష్ట్రం అప్పులకూబిలో కూరుకుపోయిందని అన్నారు.
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది అని, మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు అని 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాల వల్ల గద్దెనెక్కిన కెసిఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని యావత్తు తెలంగాణ సమాజాన్ని నమ్మించి మోసం చేశాడని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని నమ్మించి దళితులను నట్టేట ముంచారు. అగ్గిపెట్టెలాంటి ఇండ్లు మనకెందుకు అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి రెండు పడక గదుల ఇండ్లు కట్టిస్తానని మోసం చేశారని అన్నారు. గిరిజన, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఏమైంది, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య ఎంతవరకు వచ్చింది, నిరుద్యోగ భృతి ఎంతవరకు వచ్చిందని, రైతు రుణమాఫి ఏమైంది, పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారని, కెసిఆర్ గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయని అన్నారు. బీజేపీ మరియు బి.ఆర్.ఎస్. పార్టీలు రెండు ఒక్కటే, డిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉంది వారి ధోరణి అని అన్నారు. కేంద్రంలో బీజేపీ నిత్యావసర సరుకుల ధరలు, చమురు ధరలు పెంచి సామాన్యుడు బ్రతకలేని స్థితికి తీసుకువచ్చింది అని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం అని, ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించి, దేశ సంపదను అదాని, అంబానిలకు మోడీ గారు దోచిపెట్టారని అన్నారు.
రాష్ట్రంలో బి.ఆర్.ఎస్.పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ గారు, మహిళా రిజర్వేషన్ ఏమైంది, విద్యార్థుల ఫీజు రీ - ఇంబార్సుమెంట్ ఏమైంది అని, గిరిజన యూనివర్సిటీ ప్రకటించి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు యూనివర్సిటీ తరగతులు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు, మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చిందని, బస్ డిపో ఎందుకు ఇవ్వలేకపోయారు అని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లాను ఇతర జిల్లాల కంటే ఎంతమేరకు అభివృద్ధి చేశారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. నేను ప్రజా సేవకురాలిని, ప్రజా క్షేత్రంలో పని చేస్తూ నిత్యం ప్రజా సమస్యల్లో పాల్గొంటూ, కష్టాల్లో ఉన్నవారికి నా వంతు సహాయం చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాను అని అన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేసే బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నించే నాయకులకు నా సూటి ప్రశ్న మీరు ఈరోజున అనుభవిస్తున్న స్వాతంత్ర్యం, అధికారం, హోదాలు, చదువుకున్న చదువులు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించింది అని, ఎన్నో ఆర్థిక ప్రణాలికలు, పంచవర్ష ప్రణాళికలు తీసుకువచ్చినదీ అని, రాజభరణాల రద్దు, భూ సంస్కరణల చట్టం, అటవీ హక్కుల చట్టం తెచ్చి పేదలకు భూములు పంపిణీ చేసి పట్టాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, విద్య సంస్థలు, సాంకేతిక విద్యను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి రూపాయి విలువను పెంచి దేశాన్ని ప్రపంచ దేశాలకు పోటీకి తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ, ఉచిత ఎమర్జెన్సీ సేవలు, విద్యార్థులకు ఫీజు రీ - ఇంబర్సుమెంట్, ఇందిరా జల ప్రభ, ఏకకాలంలో రైతు రుణమాఫి, పంట రుణాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లాంటి పథకాలతో అభివృద్ధి చేసిందని అన్నారు.
ధరణి వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు అని అన్నారు. అలాగే ఇటీవల వర్షాలు పడి వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతే నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను అరిగోసపెడుతున్న పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ అని అన్నారు. నేడు ఎన్నికలు దగ్గరకు రాగానే ప్రజల దగ్గరికి వచ్చి దొంగ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. విలేఖరులకు ఇస్తానన్న ఇండ్ల స్థలాలు ఇప్పటివరకు ఇవ్వకుండా పత్రిక, మీడియా సోదరులను మోసం చేసిన అధికార పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయూభ్ ఖాన్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చిటమట రఘు
ఎండీ అఫ్సర్ పాషా,ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,
తో పాటు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జెడ్పీటీసీ, ఎంపీపీ
ఎంపీటీసీ, సర్పంచులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ జిల్లా,మండల నాయకులు తదితరులు ఉన్నారు