సాక్షితవిశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలంలో జరిగే చందనోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. ఆలయాలలో అమలులో ఉన్న ఆగమ విధానాలను సమీక్షించాలని, ధార్మిక సలహా మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు
విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన దేవాదాయ కమిషనర్
Related Posts
CMRF మరియు L.O.C చెక్కులను అందజేసిన ప్రత్తిపాటి పుల్లారావు
SAKSHITHA NEWS CMRF మరియు L.O.C చెక్కులను అందజేసిన ప్రత్తిపాటి పుల్లారావు పేట పట్టణానికి చెందిన గోపిదేశీ త్రివేణి, హరికృష్ణ దంపతులకు జన్మించిన కవల పిల్లలకు అత్యవసర వైద్యం నిమిత్తం వరలక్ష్మి ఆసుపత్రి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3లక్షల…
అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము
SAKSHITHA NEWS అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తాము కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను ప్రారంభించిన నారా భువనేశ్వరి కుప్పం : కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి…